The Pushpa-2 | కేవలం 10 రోజుల్లో రూ.500 కోట్లు
The Pushpa-2 | కేవలం 10 రోజుల్లో రూ.500 కోట్లు
బాలీవుడ్ సిని పరిశ్రమలో బీభత్సం సృష్టిస్తున్న‘పుష్ప 2’
Hyderabad : తెలుగు స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa-2) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా మొదటిరోజు నుంచే హిందీలో రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్ పేరిటా ఉన్న రికార్డును బద్దలుకొట్టిన పుష్పరాజ్ ఆ తర్వాత వరుసగా మూడు రోజులు రికార్డు కలెక్షన్లు సాధించాడు. ఇప్పటివరకు హిందీలో ఏ సినిమాకు కూడా సాధ్యం కానీది ఒక్క రోజుల్లో(రూ.86 కోట్ల కలెక్షన్స్) రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును సైతం నమోదు చేసింది. సినిమా విడుదలైన కేవలం 10 రోజుల్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసుళ్లను రాబట్ట గలిగింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మున్ముందు ఎన్ని వందల కోట్లను వసూల్ చేస్తుందో.. ఎన్ని పాత రికార్డులను చెరిపి వేసి, కొత్త రికార్డులను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.
* * *
Leave A Comment